BDK: తుఫాన్ కారణంగా విద్యుత్ తీగలు తెగి పడే ప్రమాదం ఉన్నందువల్ల తడిసిన తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్ళవద్దని భద్రాద్రి జిల్లా విద్యుత్ శాఖ అధికారులు బుధవారం ప్రకటించారు. నీటిలో నిలబడి ఎలక్ట్రికల్ పరికరాలు వాడవద్దని, హై వోల్టేజ్ తీగల కింద ఫోన్ ఆపరేట్ చేయొద్దని సూచించారు. వైర్లు తెగిపడితే వెంటనే 1912కు సమాచారం ఇవ్వాలన్నారు.