MDK: ప్రధాని మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శనివారం ఆయన మెదక్ R&B గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడారు. దేశం వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తోందన్నారు. మోదీ ప్రధాని కాకముందు 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ నేడు 4వ స్థానానికి చేరిందని హర్షం వ్యక్తం చేశారు.