ప్రకాశం: గిద్దలూరు మండలం దిగువమెట్ట నల్లమల్ల అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మేరక పాత రైల్వే వంతెనను లారీ ఢీకొట్టడంతో నంద్యాల జిల్లా కణాల గ్రామానికి చెందిన దూదేకుల బాల హుస్సేన్ (60) అనే లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరొకరికి గాయాలు కావడంతో అతన్ని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.