ADB: బోథ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.