ASR: చింతపల్లి మండలంలోని పెంటపాడు గ్రామ సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పల్సర్ బైక్పై వేగంగా వెళుతున్న వ్యక్తి బ్రిడ్జి వద్ద అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.