KMR: బిక్కనూర్ మండల కేంద్ర శివారులో దక్షిణ కాశీగా పిలిచే సిద్ధిరామేశ్వర ఆలయంలో కార్తీక మాస తొలి శనివారం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొడకండ్ల రామగిరి శర్మ ఆధ్వర్యంలో వ్రతాలను చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.