HYD: జూబ్లీహిల్స్ సిట్టింగ్స్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ అడుగులు వేస్తుంది. మూడు పర్యాయాల పాటు ప్రాతినిధ్యం వహిస్తున్న జూబ్లీహిల్స్ స్థానం ఎట్టి పరిస్థితిలో చేజారకుండా గట్టి ప్రయత్నాలకు దిగింది. పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, సెంటిమెంట్ కోసం పావులు కదుపుతోంది. కాగా, జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో వేచి చూడాల్సిందే.