W.G: పాలకొల్లు నుంచి ఆచంటకు రూ.1.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం రోడ్లను నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక పాలకొల్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.