భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (14,234 పరుగులు) రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (18,426 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.