NLR: ఒరిస్సా నుంచి గంజాయి తీసుకు వచ్చి జిల్లాలో అమ్మకాలు సాగిస్తున్న ఇద్దరు నిందితులను సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. దాని విలువ సుమారు రూ.1,20,000 ఉంటుందని సంతపేట సీఐ సోమయ్య ఇవాళ తెలిపారు. నిందితుల దగ్గర నుంచి రెండు సెల్ ఫోన్లు సైతం స్వాధీనం చేసుకున్నామన్నారు.