KMR: జిల్లా కేంద్రంలోని IDOC ఆవరణలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ స్థలాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు కోసం రూ.5.80 కోట్లు నిధులు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులకు విగ్రహ ఏర్పాటుపై పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్ & బీ EE మోహన్ పాల్గొన్నారు.