NRML: అర్హులైన ప్రతి వికలాంగునికి యూడిఐడి కార్డులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. ఇప్పటివరకు నిర్మల్ జిల్లాలో నెలకు 12 శిబిరాలు నిర్వహిస్తూ ఇప్పటివరకు 960 యూడిఐడి కార్డులు అందజేశామని శనివారం సమావేశంలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐడి కార్డుల అందజేతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.