ASR: బెర్రీ బోరర్ కీటకం సోకి నష్టపోయిన గిరిజన కాఫీ రైతులకు నష్టపరిహారం చెల్లించి, ఆదుకోవాలని కాఫీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు డిమాండ్ చేశారు. శనివారం అరకులో ఆయన మాట్లాడారు. అరకు మండలం చినలబుడు, చొంపి, పెదలబుడు, మాదల, కొత్తబల్లుగూడ పంచాయతీల్లో సుమారు 3వేల ఎకరాల్లో కాఫీ నష్టం జరిగిందని తెలిపారు. కాఫీ తోట ఎకరానికి రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలన్నారు.