JGL: కొడిమ్యాల మండలంలోని పూడూరు, రామకృష్ణాపూర్ గ్రామాల్లో పీఏసీఎస్ ద్వారా కొడిమ్యాల, చెప్యాల గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రారంభించారు. రైతులకు గ్రేడ్ఏకు రూ.2389, సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధర చెల్లిస్తామని అన్నారు.