ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 29 పరుగులు పూర్తి చేయడం ద్వారా అతడు ఈ ఘనతను సాధించాడు. ఈ క్రమంలో ఆసీస్ తరఫున అత్యంత వేగంగా(76 ఇన్నింగ్స్‌లలో) 3000 పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డ్ స్టీవ్ స్మిత్ (79 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది.