రిటైర్మెంట్పై వస్తున్న విమర్శలకు హిట్‌మ్యాన్ రోహిత్ (121*), కింగ్ కోహ్లీ (74*) ధీటైన జవాబిచ్చారు. ఆసీస్‌తో జరిగిన చివరి వన్డేలో ఈ జోడీ అజేయంగా 168 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు విజయాన్ని అందించారు. ఈ ఇన్నింగ్స్‌తో తమలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించి.. విమర్శకుల నోళ్లను మూయించారు. అలాగే, 2027 WC రేస్‌లో తాము ఉన్నామనే స్పష్టమైన సందేశాన్ని పంపారు.