ATP: రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు ఎగువ రాష్ట్రం నుంచి భారీగా వరద కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం 6వ గేటును అర్ధ అడుగు మేర ఎత్తి నీటిని వేదావతి హగరికి విడుదల చేశారు. హగరి సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. మరింత వరద ఉధృతి కొనసాగితే మరో గేటు ఎత్తే అవకాశం ఉందన్నారు.