సత్యసాయి: బుక్కపట్నం మండలం గూనిపల్లి పంచాయతీలో పుట్టపర్తి వైసీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పర్యటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల సామాన్యులకు కలిగే ఇబ్బందులను వివరించారు. అనంతరం కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు. గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.