PDPL: పాలకుర్తి మండలం కన్నాల గ్రామం వద్ద ఉన్న రైల్వే గేటును (లెవెల్ క్రాసింగ్ నం. 46) అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అత్యవసరంగా రైల్వే ట్రాక్ బేస్‌ను తొలగించి, కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉన్నందున శనివారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు గేటు మూసి ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.