ప్రకాశం: మద్దిరాలపాడులో కెనరా బ్యాంకు తిరిగి ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అతిథిగా కెనరా బ్యాంకు జనరల్ మేనేజర్ పాండురంగ హాజరయ్యారు. బ్యాంకు తిరిగి ప్రారంభంకావడంతో ఆర్థిక లావాదేవీలు, రుణాలు, పథకాలు ఇప్పుడు గ్రామంలోనే సులభంగా పొందవచ్చని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, రైతులు ఈ సేవలతో ఎంతో సంతృప్తిగా ఉన్నారన్నారు.