ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. గత రెండు మ్యాచ్‌లలో వరుసగా డకౌట్ కావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ‘కింగ్ కోహ్లీ’ ఈ మ్యాచ్‌లో తన బ్యాట్‌తోనే జవాబిచ్చాడు. కేవలం 56 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.