ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 95 మంది లబ్ధిదారులకు రూ.37 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. కొండపి నియోజకవర్గంలో ఇప్పటివరకు 996 మందికి రూ.7.93కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం చంద్రబాబు పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు.