KMM: తల్లాడలో డ్రైనేజీ సమస్య, రోడ్డు గుంతలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల కమిటీ ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన తెలిపారు. రింగ్ సెంటర్లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉన్నందున ట్రాఫిక్ పోలీసును నియమించాలని, సెంట్రల్ లైటింగ్, సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.