KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 27న సోమవారం ఉదయం 10:30 గంటలకు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ భీముని పల్లె లక్ష్మీదేవి తెలిపారు. సమావేశం ఎజెండాలో 19 అంశాలను చేర్చినట్లు తెలిపారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు, టెండర్లు, పారిశుద్ధ్య కార్మికులకు సంబందించిన అంశాలను ఎజెండాలో పెట్టారు.