VKB: పరిగి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం చిరుజల్లులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. వర్షంతో వేరుశనగ, కంది పంట సాగు చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ వర్షం పట్ల వరి రైతులు ఆందోళన చెందుతున్నారు.