MDK: పోలీస్ అమరవీరుల త్యాగాలు వృథా కావని జిల్లా ఎస్పీ DV శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మాన వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీసులు కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ఎల్లప్పుడూ ముందుంటారన్నారు.