ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హిట్మ్యాన్ రోహిత్ శర్మ(121*), కింగ్ కోహ్లీ (74*) దుమ్మురేపారు. వీరిద్దరూ రెండో వికెట్కు అజేయంగా 168 పరుగులు జోడించి, జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు బౌలింగ్లో హర్షిత్ రాణా 4 వికెట్లతో రాణించాడు.