ADB: పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తాజాగా 15 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు. పట్టణంలో వివిధ 52 అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని మే 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వుల పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు.