NZB: ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద శనివారం ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు, ఫిట్నెస్ ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డుపైకి వస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాల తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.