ASR: ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని శనివారం కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులకు ఆదేశించారు. అక్టోబర్ 26 నుంచి 29 వరకూ భారీ వర్షాలని, వాతావరణ శాఖ ప్రకటించిందని తెలిపారు. 28, 29వ తేదీలు చాలా ముఖ్యమన్నారు. 4 రోజులు విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.