KNR: సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో శనివారం పాడి పశువులకు గాలికుంటు నివారణ వ్యాధి టీకాలను పంపిణీ చేసినట్లు మండల పశు వైద్యాధికారి విజేందర్ రావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వ్యాధి వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుందని, వైరస్ వల్ల పశువులకు నోటిలో పుండ్లు, చొంగ కారడం, మేత మేయక పోవడం, కాలి గిట్టెల మధ్య పుండ్లు అయి నడవక పోవడం, పాల దిగుబడి తగ్గుతుందన్నారు.