KMR: జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడాకారులను శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు మీరు తెచ్చిన గౌరవం ప్రశంసనీయమైనది. ఇదే ఉత్సాహం, కృషి, పట్టుదలతో ముందుకు సాగాలన్నారు.