MLG: జిల్లా గ్రంథాలయ ఆవరణలో సంస్థ ఛైర్మన్ రవిచందర్ సిబ్బందితో కలిసి శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని, జిల్లాలో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రంథాలయాలు యువతలో విజ్ఞానాన్ని పెంచుతాయని, మరిన్ని గ్రంథాలయాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.