JN: బచ్చన్నపేట మండలం బండ నాగారం గ్రామానికి చెందిన రాపెల్లి కమల మోకాళ్ళ మార్పిడి సమస్యతో బాధపడుతూ.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడగా విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన రూ.1.5 లక్షల ఎల్వోసీని మంజూరు చేయించి శనివారం అందజేశారు.