MHBD: కొత్తగూడ మండలం కర్నగండి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బంగారి వెంకటయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయాన్ని మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య మంత్రి సీతక్కకు తెలిపారు. ఇవాళ మంత్రి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతలు క్వింటా బియ్యం, రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.