PPM: మంతా తుఫాన్ హెచ్చరికల నేపద్యంలో జె. సీ. యశ్వంత్ కుమార్ రెడ్డి అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేశారు. రాబోయే 72 గంటల అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమై తగిన ఏర్పాట్లుతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలన్నారు.