ADB: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా కల్పిస్తున్న మందులనే వాడుకోవాలని వైద్యాధికారి చరిత్ అన్నారు. శనివారం నేరడిగొండ మండలం కుంటాల(బి) గ్రామంలో ‘పీఎం జన్మన్’ వైద్య శిభిరాన్ని నిర్వహించారు. గ్రామస్థులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణి చేశారు. అత్యవసరాలకు 108ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో సాయి కిరణ్, ఉమా, సుమతి తదితరులు పాల్గొన్నారు.