E.G: రాజానగరం మండలం సూర్యరావు పేట గ్రామానికి చెందిన పలువురు YCP నాయకులు శనివారం రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేనలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి, సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధిని చూసి పార్టీలోకి చేరినట్లు చెప్పారు.