సత్యసాయి: కదిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బీయస్ మక్బూల్ వైసీపీ కార్యాలయంలో ప్రజా ఉద్యమం పోస్టర్ విడుదల చేశారు. 28న జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజా వైద్య విద్య అభివృద్ధికి 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించిందని, కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేస్తోందని విమర్శించారు.