ASF: ఆసిఫాబాద్ BRSలో చేరికల పర్వం కొనసాగుతుంది. శనివారం MLA కోవ లక్ష్మి సమక్షంలో కెరమెరి మండలం అనార్ పల్లి, తుమ్మగూడ, సొమ్లగూడ, కొలంగూడ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల ముఖ్య నాయకులు వారి అనుచరులతో దాదాపు 200 మంది BRS తీర్ధం పుచ్చుకున్నారు. వీరికి MLA పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కి గట్టి బుద్ది చెప్పాలన్నారు.