ADB: ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే తప్పకుండ నెరవేరుస్తామని బోథ్ నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. శనివారం నేరడిగొండ మండలంలోని కుంటాల గ్రామంలో ఉన్న సంత్ రామారావు మహారాజ్ వద్ద మంజూరైన షెడ్డు కోసం భూమి పూజ చేశారు. ప్రజలకు ఉన్న అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.