టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ ఓ క్యాచ్ అందుకోవడం ద్వారా వన్డేల్లో 100 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమిండియా తరుఫున ఈ ఘనత సాధించిన 6వ ప్లేయర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు కోహ్లీ(163), అజారుద్దీన్(156), సచిన్(140), ద్రావిడ్(124), రైనా(102) మాత్రమే ఈ ఫీట్ సాధించారు.