తమిళ స్టార్స్ కమల్ హాసన్, రజినీకాంత్ కాంబోలో మల్టీస్టారర్ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూవీకి డైరెక్టర్ ఎవరా అనే విషయం ఆసక్తిగా మారింది. ఈ చిత్రాన్ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించనున్నట్లు టాక్. తాను తెరకెక్కిస్తోన్న ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తయిన తర్వాత దీన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.