BDK: బూర్గంపాడు మండలం తాళ్లగొమ్మూరుకు చెందిన శివశంకర్ రెడ్డిపై పీడీ యాక్టు నమోదుకై ఉన్నతాధికారులకు జూలూరుపాడు పోలీసులు పత్రాలు సమర్పించారు. నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న దుగ్గెంపూడి శివశంకర్ రెడ్డిపై పీడీ యాక్టు అవ్వగా ఎస్పీ రోహిత్ రాజు, డీఎస్పీ రెహమాన్ సలహాతో సీఐ శ్రీలక్ష్మి శనివారం ఈ చర్యలు తీసుకున్నారు.