AKP: బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులు చేపట్టిన రిలే దీక్షలు శనివారం నాటికి 42వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే హెట్రో డ్రగ్స్ కంపెనీ వల్ల పలువురు అనారోగ్యంతో మృతి చెందారని అన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు అయితే ఉపాధిని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.