ప్రకాశం: కంభం చెరువును శనివారం మార్కాపురం ఆర్టీవో శివరామిరెడ్డి సందర్శించారు. ఇందులో భాగంగా చెరువు పరిసరాల పరిస్థితిని, నీటి మట్టం స్థాయిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులతో మాట్లాడి, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరభద్ర చారి, తహసీల్దార్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.