E.G: కడియం మండలం బుర్రిలంక గ్రామంలో రూ. 2.05 కోట్ల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రహదారిని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ శనివారం ప్రారంభించారు. ఎన్ఆర్ఇజీఎస్, మండల పరిషత్ నిధులతో కలవకట్టి నుంచి ఏటిగట్టు వరకు ఈ రోడ్డును నిర్మించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో సహా కూటమి నాయకులు పాల్గొన్నారు.