ELR: వివాదాలను శాంతియుత చర్చల ద్వారానే పరిష్కరించుకోవడం మేలని చింతలపూడి సివిల్ జడ్జి మధుబాబు తెలిపారు. ఇవాళ చింతలపూడి మండలం నామవరం గ్రామంలో చట్టాల పట్ల అవగాహన న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాజీ మార్గం రాజమార్గమని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం వలన బావితరాలకు వివాదాలు రాకుండా వుంటాయన్నారు.