MHBD: కేసముద్రం పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన మార్కెఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శనివారం మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ప్రారంభించారు. వ్యాపారస్తులు రైతులను మోసం చేయొద్దని, మార్కెట్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.