TPT: ఓ రిపోర్టర్ నిజాయతీ చాటుకున్నాడు. శిల్పరామంలో ఉదయం వాకింగ్ చేస్తున్న రిపోర్టర్ కార్తీక్కు రెండున్నర సవరాల బంగారు బ్రాస్ లెట్ దొరికింది. గంటన్నర పాటు ఆరా తీసి అది ఓ పెళ్లి బృందానికి చెందినది గుర్తించి వారికి బంగారాన్ని తిరిగి అప్పగించారు. ఆ యువకులకు పెళ్లికొడుకు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపగా.. వాకర్స్ సభ్యులు శాలువాతో సత్కరించారు.